- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షులు కొండూరు రవీందర్ రావుది నేడు పుట్టిన రోజు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన తాడిచర్లలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలోని విద్యార్థులకు ఆర్థిక, అక్షరాస్యతపై సహకార బ్యాంక్ తాడిచర్ల మేనేజర్ దుంపల వెంకటరాజం శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య హాజరై విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సీఈఓ సంతోష్,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు,బ్యాంక్,పిఏసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -