Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాళేశ్వరంపై తప్పుడు ప్రచారం

కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం

- Advertisement -

– కమిషన్‌ను సర్కారు తప్పుదోవ పట్టిస్తున్నది :హరీశ్‌రావు విమర్శ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కాళేశ్వరం మీద ఏర్పాటైన పీసీ ఘోష్‌ కమిషన్‌ను కాంగ్రెస్‌ సర్కార్‌ తప్పుదోవ పట్టిస్తున్నదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం ఆ కమిషన్‌కు ఆయన అదనపు సమాచారం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కమిషన్‌ గురువారం సమయమిచ్చిందనీ, కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైద్య పరీక్షలు ఉన్న నేపథ్యంలో రాలేకపోతున్నట్టు కమిషన్‌ను అనుమతి కోరగా అంగీకరించిందని చెప్పారు. వారిచ్చిన సమయం ప్రకారం, శుక్రవారం కమిషన్‌ను కలిసి మా వద్ద ఉన్న అదనపు సమాచారాన్ని అందించామన్నారు. మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను దష్టిలో పెట్టుకొని మా వద్ద ఉన్నంత మేరకు కమిషన్‌కు స్పష్టమైన సమాచారం ఇచ్చామని తెలిపారు.

” మేం ఇప్పుడు ప్రభుత్వంలో లేము. డాక్యుమెంట్స్‌ అన్ని ప్రభుత్వం వద్ద ఉంటాయి. సమాచారం కోసం చీఫ్‌ సెక్రెటరీ, జీఏడీ సెక్రెటరీ, ఇరిగేషన్‌ సెక్రెట్రరీకి లేఖ రాశా. ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్‌ నిర్ణయాలు, క్యాబినెట్‌ నోట్‌ వంటి సమాచారం కావాలని లేఖల రూపంలో అడిగా. కాని వారి నుంచి స్పందన రావడం లేదు. మా వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి నివేదిక రూపంలో ఇచ్చాం. మా సమాచారం ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు క్యాబినెట్‌ నిర్ణయాలు జరిగాయి. ఆ ఆరుసార్లు క్యాబినెట్‌ ఆమోదం పొందిన డాక్యుమెంట్లు కమిషన్‌కు అందించాం. మూడు సార్లు శాసనసభ ఆమోదం కూడా పొందింది. ఎప్పుడెప్పుడు జరిగాయి, జరిగిన చర్చ, ఇతర అంశాలనూ కమిషన్‌కు అందించాం.

లెజిస్టేచర్‌ అప్రూవల్‌ క్యాబినెట్‌ కంటే కూడా ఉత్తమమైనటు వంటిది” అని హరీశ్‌రావు వివరించారు. ”కమిషన్‌ ఆన్‌ గోయింగ్‌ కనుక ఆ వివరాలు బయట పెట్టలేను. సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా ఆ వివరాలు బయట పెడతాం. ఇంతకు మించిన వివరాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మేం అడిగినా ఇవ్వడం లేదు. కమిషన్‌కు అందించిన సమాచారం మాకు ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం ఇవ్వడం లేదు. పారదర్శకంగా ఉండాలనుకుంటే మాకు ఆ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు” అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అంతేకాక ప్రజాభవన్‌లో జరిగింది పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కాదనీ, కాంగ్రెస్‌ తెలంగాణకు 50 ఏండ్లుగా చేసిన మోసాలకు కవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో సెక్షన్‌ 3ని సాధించింది కేసీఆర్‌ అని గుర్తు చేశారు. ట్రిబ్యునల్‌ ఆయన వల్లే వచ్చిందన్నారు. సీఎం రేవంత్‌ అతి తెలివి ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -