- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : నగరంలోని ఆర్టీసీ బస్టాండుకు ప్రహరీ గోడను నిర్మిస్తున్నారు. అయితే ఉత్తరం వైపునే రాకపోకలకు గేట్లను పెట్టడంతో పలు కాలనీలకు వెళ్లే ఇబ్బందిగా మారిందని, ఈ క్రమంలో శనివారం డిపో మేనేజర్ రవికుమార్ కు వినతి పత్రం అందించారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, విద్యానగర్, పెర్కిట్ లతో పాటు గణేష్ నగర్ కాలనీ, పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్లు ఉన్నాయని తెలిపారు. మొత్తం ప్రహరీ గోడను నిర్మించడంతో బస్టాండ్ కు వెళ్లడానికి ప్రజలు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రహరీ గోడకు రెండు వైపులా గేట్లు ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ ను ఈ సందర్బంగా కోరినట్టు విద్యానగర్ కాలనీవాసులు తెలిపారు.
- Advertisement -