Sunday, July 13, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మందుబాబులు జ‌ర జాగ్ర‌త్త‌

మందుబాబులు జ‌ర జాగ్ర‌త్త‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : మన రాష్ట్రంలోనే కాక.దేశవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాలు, హత్యలు, లైంగిక‌దాడులు వంటి దారుణాలకు ప్రధాన కారణం మద్యపానం. మందు తాగడం వల్ల.. అది సేవించిన వారు మాత్రమే కాక.. కుటుంబాలు కూడా నాశనం అవుతాయని ఎవరు ఎంత చెప్పినా.. ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసినా మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇక తెలంగాణలో అయితే రోజురోజుకు మద్యం అమ్మకాలు పెరుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఫుల్లుగా మద్యం సేవించి.. అడ్డగోలుగా వాహనాలు డ్రైవ్ చేస్తూ..జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటుగా ఇతర చర్యలు తీసుకున్నా సమస్య పరిష్కారం అవ్వడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో మందుబాబులకు పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. ఇకపై ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు, బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 30 ఎంజీ కంటే ఎక్కువ మోతాదులో మద్యం ఉన్నా.. చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అడిషనల్ డీసీపీ రామదాసు వెల్లడించారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు మెగా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. సీపీ సీవీ ఆనంద్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేశారు. ప్రజలు రాత్రి వేళల్లో మాత్రమే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తారని అనుకుంటున్నారు. కానీ ఇకపై ఎప్పుడైనా, ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని రామదాసు స్పష్టం చేశారు.
మద్యం సేవించినప్పుడు చాలామంది విచక్షణ కోల్పోతారు. మత్తులో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. 2024లో దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు లక్షా 80 వేల మంది చనిపోయారు. అందులో 40 శాతం డ్రంకెన్ డ్రైవ్ చేయడం వల్లే జరిగాయని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ వరుసగా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం అని రామదాసు అన్నారు. యువత డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. స్కూల్ బస్సు డ్రైవర్లు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు సమాచారం ఉందని, వారిపై కూడా రెగ్యులర్ తనిఖీలు చేస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నామని రామదాసు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -