Sunday, July 13, 2025
E-PAPER
Homeజిల్లాలుఉత్తమ కవి అవార్డు అందుకున్న కల్పన దేవసాని

ఉత్తమ కవి అవార్డు అందుకున్న కల్పన దేవసాని

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్ : నీతి ఆయోగ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన మనం ఫౌండేషన్ తొమ్మిదేండ్ల విజయయాత్రను పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంలో హైదరాబాదులో చిక్కడపల్లిలో త్యాగరాయ గానసభలో ఘనంగా కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనానికి నిజామాబాద్ జిల్లా కంజర బాలికల గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధి నిర్వహిస్తున్న కల్పన దేవసానికి ప్రత్యేక ఆహ్వనం లభించింది. ఈ కార్యక్రమంలో కల్పనకు 2025 సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ కవి అవార్డు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యోగుల సంఘం హానరరీ చైర్మన్ అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎ పద్మాచారి, సాహితీవేత్త విమర్శకులు ఎన్ వి రఘువీర్ ప్రతాప్, ఫౌండేషన్ అధ్యక్షులు డా.కె చక్రవర్తి కల్పనకు అవార్డు ప్రధానోత్సవం చేశారు. ఇందులో ప్రముఖ సాహితీ వేత్తలు భాగం పంచుకున్నారు. ఇంత గొప్ప అవార్డు పొందడం పట్ల కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు ఇంకా మిత్ర బృందం కల్పన దేవసానికి అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -