నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లద్దఫ్ మౌలానబీ పొలంలో విద్యుత్ మరమ్మతులు చేస్తూ పోకల హన్మాండ్లు (వయస్సు సుమారు 45) అనే కౌలు రైతు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ముదేల్లి గ్రామానికి చెందిన హన్మాండ్లు, వృత్తి రీత్యా కౌలు రైతుగా పని చేస్తున్నారు. ఆ రోజూ లద్దఫ్ మౌలానా భీ పొలంలో స్టార్టర్ డబ్బాలో లోపం వచ్చిన నేపథ్యంలో విద్యుత్ సరఫరా సరిచేయడానికీ ఆ పనిలో నిమగ్నమయ్యారు. అయితే అప్రమత్తత లోపంతో ఓ విద్యుత్ వైరు తగలడంతో తీవ్రమైన షాక్‌కు గురై ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా.. ప్రయోజనం లేకపోయింది. హన్మాండ్లుకు భార్య శకుంతల, ఇద్దరు కుమార్తెలు అంజలి, అఖిల ఉన్నారు. ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. మృతుని భార్య శకుంతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ షాక్ తో రైతు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES