- Advertisement -
ఎవరు పిలిచారో!
మేఘాన్ని….
ఉన్నపళంగా వెళ్ళిపోయింది
మనసులో మాటలు
ఇంకా మిగిలే ఉన్నాయి
తనివి తీరని తలపులెన్నో
తలుపు చాటునే పొంచాయి
కదలిపోతున్న మేఘాన్ని
కదలకుండా చూస్తూ…
నేలపై శిలలా…
ఒంటరిగా నేను
నా గుండె శబ్దం
ఏ విహంగం వినిపించిందో!
ముందుకెళ్ళిన మేఘం
క్షణాల్లో నా ముందుకొచ్చింది
నన్నే చూస్తూ నిలుచుంది
మనసు మురిసి
మాటల ముడి విప్పి
పూర్తిగా వినిపించా…
చినుకులు
నా చిన్ననాటి స్నేహితులు
చిందులేయాలన్నది
నా..చిరకాల కోరిక
ముద్దగా తడిసి
మనసు ముసురంతా
చెరిగిపోయింది
జల్లులు కురిసి
మేఘం కూడా తేటతెల్లమైంది
ఆలస్యం చేయక !
రంగుల తాడు విసిరి
చూపును కట్టేసింది
హరివిల్లు.
-ఎ. నాగాంజనేయులు,
9959017179
- Advertisement -