- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బెంట్లీ సిస్టమ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఈ నెల 17న హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌డే నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీలు, హైస్పీడ్ రైలు, డిజిటల్ నీటి వ్యవస్థలు, స్థిరత్వ ఇంధన నెట్‌వర్క్‌ల్లో భారతదేశ మౌలిక సదుపాయాలను రూపొందించే డిజిటల్ ట్విన్స్, జియోటెక్నికల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించనున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ, పరిశ్రమ, సాంకేతిక నాయకులను ఒకచోట చేర్చి, డిజిటల్ డెలివరీ, జియోటెక్నికల్ సొల్యూషన్స్, డిజిటల్ ట్విన్స్ ద్వారా రవాణా, నీటి మౌలిక సదుపాయాల సవాళ్లను పరిష్కరించే చర్చలు జరుగుతాయని తెలిపింది.
- Advertisement -