న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై 10 నాటికి కేంద్ర ప్రభుత్వ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 1.3 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేట్, నాన్-కార్పొరేట్ పన్ను వసూళ్లలో తగ్గుదలనే ఇందుకు కారణం. 2025-26లోని జులై 10 వరకు స్థూల వసూళ్లు 3.2 శాతం పెరిగి రూ.6.6 లక్షల కోట్లకు చేరాయి. అయితే ఇదే సమయంలో రిఫండ్‌లు 38 శాతం పెరిగాయి. దీనివల్ల నికర వసూళ్లు తక్కువగా చోటుచేసుకున్నాయి. దీంతో నికర వసూళ్లు రూ.5.6 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ మొత్తం 2024-25 ఇదే కాలంతో పోలిస్తే 1.3 శాతం తక్కువ. నికర కార్పొరేట్ పన్ను రాబడిలో 3.7 శాతం క్షీణిత చోటుచేసుకుంది. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, సంస్థలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్, స్థానిక అధికారులు తదితర నాన్‌కార్పొరేట్ పన్ను వసూళ్లు 0.04 శాతం తగ్గాయి.