బీజింగ్ : వచ్చే వారం చైనా నగరమైన తియాన్జిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరవుతున్నారు. ఈ సమావేశం 15న జరుగుతుందని చైనా విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి హాజరవడంతో పాటూ జై శంకర్ చైనాలో పర్యటిస్తారని అధికార ప్రతినిధి చెప్పారు. అయితే వివరాలు వెల్లడించలేదు. వివిధ రంగాల్లో ఎస్‌సిఓ సహకారంపై మంత్రులు పరస్పరం అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రధాన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై కూడా చర్చిస్తారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి తీసుకువచ్చే క్రమంతో పాటూ ఆటోమొబైల్స్‌తో సహా పలు ఉత్పత్తులకు అవసరమైన కీలకమైన లోహాల ఎగుమతిని చైనా నిలిపివేయడంపై కూడా చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. చైనావిదేశాంగ మంత్రి వాంగ్ యి కూడా ఈ నెల్లో భారత్ వచ్చే అవకాశం వుంది.
వచ్చేవారం చైనాలో జైశంకర్ పర్యటన
- Advertisement -
- Advertisement -