నవతెలంగాణ – రామారెడ్డి : రామారెడ్డి మండలంలో పెద్దపులి సంచారం చేసినట్లు అడవి అధికారులతో పాటు పోలీసులు ఆదివారం గుర్తించారు. మండలంలోని అన్నారం అడవి ప్రాంతంలో ఆవును చంపి తిని మిగిలిన అవశేషాలను, పెద్దపులి అడుగులను గుర్తించినట్లు ఎఫ్ ఆర్ ఓ దివ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై లావణ్య మాట్లాడుతూ… మండలంలోని మద్దికుంట, రెడ్డిపేట్, రెడ్డిపేట తండాలతోపాటు అన్నారం, గొడుగు మర్రి తాండవాసులు అడవిలోకి వెళ్ళకూడదని, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లేవారు ఒక్కరుగా వెళ్ళకూడదని, అవసరమైతేనే వ్యవసాయ క్షేత్రాలకు రాత్రి వెళ్లాలని, పరిసరాలకు ఎక్కడికి వెళ్లినా ఒక్కరుగా వెళ్ళకూడదని సూచించారు. పెద్దపులి సంచారం గానీ, ఆనవాళ్లు గానీ గుర్తిస్తే వెంటనే అడవి శాఖ అధికారులకు గాని, పోలీస్ శాఖ గాని సమాచారం అందించాలని సూచించారు. ప్రాంత వాసులు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రామారెడ్డిలో పెద్దపులి సంచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES