- Advertisement -
నేటి నుంచి జపాన్ ఓపెన్
టోక్యో : జపాన్ ఓపెన్‌లో పుంజుకునేందుకు భారత షట్లర్లు సిద్ధమవుతున్నారు. సాత్విక్, చిరాగ్ శెట్టి మెన్స్ డబుల్స్‌లో టైటిల్ వేటలో బరిలో నిలిచారు. సూపర్ 750 టోర్నమెంట్‌లో డబుల్స్ స్టార్స్‌తో పాటు సింగిల్స్ అగ్రశ్రేణి షట్లర్లు పి.వి సింధు, లక్ష్యసేన్ తలపడుతున్నారు. ఇటీవల వరుస టోర్నమెంట్లలో తడబాటుకు గురవుతున్న సింధు, లక్ష్యసేన్ కొంత విరామం తర్వాత సవాల్‌కు సిద్ధమవుతున్నారు. సాత్విక్-చిరాగ్ సహా సింధు, లక్ష్యసేన్ నేడు తొలి రౌండ్లో పోటీపడనున్నారు.
- Advertisement -