Tuesday, July 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌

- Advertisement -

35 మంది విద్యార్థినులకు అస్వస్థత
దేవరకొండ తూర్పుపల్లి ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ -దేవరకొండ

నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలోని విద్యార్థులకు సోమవారం ఫుడ్‌ పాయిజన్‌ అయ్యింది. దాంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు, తల్లిదం డ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 310 మంది విద్యార్థినులు ఉన్నారు. వారికి ఆదివారం సాయంత్రం అల్పాహారంలో పెసర గుగ్గిళ్లు పెట్టారు. రాత్రి భోజనంలో బగారా, చికెన్‌ కూర పెట్టారు. భోజనం తిన్న తర్వాత హాస్టల్లోని కొంతమంది విద్యార్థినులకు కడుపు నొప్పితోపాటు విరోచనాలు అయ్యాయి. సోమవారం ఉదయం అల్పాహారంగా పులిహోర పెట్టారు. అది తిన్న అనంతరం 35 మంది విద్యార్థులు కడుపు నొప్పి, విరోచనాలతో బాధ పడుతుండటంతో ఉపాధ్యాయులు ఏఎన్‌ఎం సహాయంతో ముదిగొండ గ్రామంలోని ఆర్‌ఎంపీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. ఆయన మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో 13 మంది, మండలంలోని తూర్పుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 22 మందిని చేర్పించారు. రెండు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందిన బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఫుడ్‌ పాయిజన్‌ వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆర్డీఓ రమణారెడ్డి, ఎంపీడీవో డానియల్‌, సీఐ నర్సింహులు ఆస్పత్రులకు చేరుకొని బాలికలను పరామర్శించారు. అనంతరం ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -