Tuesday, July 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమోటూరు పూర్ణచంద్రరావు మృతికి సీఐటీయూ సంతాపం

మోటూరు పూర్ణచంద్రరావు మృతికి సీఐటీయూ సంతాపం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీనియర్‌ కార్మిక నాయకులు మోటూరు పూర్ణచంద్రరావు(81) మృతికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 1968 తర్వాత హైదరాబాద్‌ నగరంలో సీఐటీయూ నిర్మాణంలో ఎన్‌వి. భాస్కర్‌రావు, లక్ష్మీదాస్‌, స్వామిలతో కలిసి పూర్ణచందర్రావు చేసిన కృషి మరువ లేనిదని పేర్కొన్నారు. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి గా 1970 నుంచి ఒక దశాబ్దం పాటు పనిచేశారని గుర్తు చేశారు. 1966లో ఆయన హెచ్‌ఎంటీలో ట్రైనీగా చేరి అక్కడ యూనియన్‌ అధ్యక్షులుగా ఎన్నిక య్యారనీ, నగరంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో నాయకత్వ అభివృద్ధి కావడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. పూర్ణచంద్రరావు మృతికి సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నదని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -