- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ ఎల్‌జీ కొత్తగా 2025 ఓఎల్‌ఈడీవో, క్యూఎన్‌ఈడీవో శ్రేణీ స్మార్ట్ టివిలను ఆవిష్కరించింది. ఈ అధునిక ఎఐ మద్దతు గల టీవీలను జెన్2 ప్రాసెసర్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రతినిధి బ్రియాస్ యంగ్ తెలిపారు. అవార్డు విన్నింగ్ పిక్చర్ టెక్నాలజీతో మెరుగైన చిత్రం, ధ్వని, ఇంటరాక్టివిటీని అందిస్తుందన్నారు. వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా స్మార్ట్ అనుభవాలను మెరుగుపరుస్తాయన్నారు. కాగా.. వీటి ధరలను వెల్లడించలేదు.
- Advertisement -