Friday, September 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: ఎస్ఎఫ్ఐ

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: ఎస్ఎఫ్ఐ

- Advertisement -

ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్
నవతెలంగాణ – పరకాల 
: ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం త్వరగా పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పరకాల ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న డిగ్రీ భవన నిర్మాణ పనులను ఎస్ఎఫ్ఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ పనులు నత్తనడుకన సాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ దశలో ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించి  డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా కాంట్రాక్టర్ను ఆదేశించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ ఎస్ఎఫ్ఐ నాయకులు అరవింద్, మహేష్ ,విజయ్, అరుణ్, సాయి, కృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -