Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిల్లలు ఎదిగితేనే సేవలకు సార్ధకత

పిల్లలు ఎదిగితేనే సేవలకు సార్ధకత

- Advertisement -

లయన్స్ సంస్కృతి అధ్యక్షురాలు సుజాత సూర్య రాజ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: పిల్లలు బాగా చదువుకుని జీవితంలో ఎదిగినప్పుడే దాతలు చేసిన సహాయాలకు సార్థకత లభిస్తుందని ప్రముఖ సంఘ సేవకురాలు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి అధ్యక్షురాలు సుజాత సూర్య రాజ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి, ఇందూర్ యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఛానల్ గ్రిల్ ను పాఠశాలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజం భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. తాము చేసే సహకారం వందలాది పిల్లల అవసరాలు తీరుస్తుందంటే ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు లయన్స్ క్లబ్ తరఫున ఆయిల్ షాంపూ కిట్లను అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్సల త్యనారాయణ మాట్లాడుతూ.. లయన్స్ వంటి స్వచ్ఛంద సంస్థల వల్ల ప్రభుత్వం దృష్టి పెట్టని అనేక సమస్యలు పరిష్కరింపబడుతున్నాయని అన్నారు.

తమ పాఠశాలలో గ్రిల్ ఏర్పాటుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ సుజాత, లయన్ రేఖ లయన్ రాజేశ్వరి, లయన్ సురేందర్, ఇందూరు యువత అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, ఉపాధ్యాయులు ఘనపురం దేవేందర్, విద్యాసాగర్, డాక్టర్ ఎస్ గంగాధర్, జావిద్, లలిత, అనిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -