- Advertisement -
– కమీషనర్ బి.నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
కల్తీ లేక నాణ్యత లేని మాంసాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని అశ్వారావుపేట పురపాలక సంఘం కమీషనర్ బి.నాగరాజు మాంసం విక్రయదారులను హెచ్చరించారు. మాంసం, చేపల దుకాణదారులు, విక్రయదారులతో ఆయన తన కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాంసం దుకాణాల పరిసరాలు శుభ్రంగా ఉండాలని, మాంసంపై ఈగలు, క్రిమికీటకాలు వాలకుండా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా ప్రధాన రహదారి పక్కన ఉన్న దుకాణదారులు దుమ్ము, ధూళి పడకుండా తగు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడ్ లైసెన్స్ తప్పకుండా పొంది ఉండాలని తెలిపారు.
- Advertisement -