- Advertisement -
- – విరివిగా మొక్కలు నాటి రక్షిద్దాం: చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ- దుబ్బాక - మనుషుల మనుగడకు మూలమైన ఆక్సిజన్ ను అందించేది మొక్కలే నని, ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. “వన మహోత్సవం”లో భాగంగా గురువారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మల్లాయిపల్లి వార్డు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కల్ని నాటారు. అనంతరం పట్టణంలోని పోచమ్మ, కాశీ విశ్వనాథుని దేవాలయాల పునర్నిర్మాణ పనులకు ఆయా కమిటీ సభ్యులతో కలిసి ఆయన కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు శ్రీనివాస్ రెడ్డిని శాలువాలు కప్పి సన్మానించారు. ఆయన వెంట కాంగ్రెస్ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు కొంగర రవి, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, ఆకుల దేవేందర్, సాయితేజ గౌడ్, పలువురు కార్యకర్తలు, టీజేఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కీసర స్వామి పాల్గొన్నారు.
- Advertisement -