నవతెలంగాణ -ముధోల్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధి సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో తమ సమస్యలను పరిష్కరించాలని గురువారం ఎంపిడిఓ శివ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఉపాధి హామీ పధకం టిఎ లు,కంప్యూటర్ ఆపరేటర్ లు, పిల్డ్ అసిస్టెంట్ ల కు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేద ని వారు పేర్కొన్నారు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న మాకు సకాలంలో వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నామని వారు వాపోయారు. ఉపాధి పని జరిగే ప్రదేశాల్లో అక్రమాలకు తావివ్వకుండా పారదర్శకంగా పనులు నిర్వహించేందుకు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ,కూలీలతో సమానంగా పనులు పర్యవేక్షిస్తున్న సకాలంలో వేతనాలు అందడం లేదని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నెల నెల వేతనాలు అందక. పస్తులుండాల్సిన దుస్థితి నెలకున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఓ శిరీషారెడ్డి, టిఎ లు భాస్కర్ రెడ్డి, యోగేష్, దేవిదాస్, శ్రీలక్ష్మి, పీల్డ్ అసిస్టెంట్ లు, కంప్యూటర్ ఆపరేటర్ లు పాల్గొన్నారు.
వేతనాలు అందించాలని వినతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES