Sunday, July 20, 2025
E-PAPER
Homeకరీంనగర్మోడల్ స్కూల్‌ను సందర్శించినజిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య

మోడల్ స్కూల్‌ను సందర్శించినజిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
అడివాసీ బాలికల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ వాయిస్ ఫర్ గర్ల్స్ ఆధ్వర్యంలో, టీజీఎంఎస్ శంకరపట్నం పాఠశాలలో జూలై 9 నుండి 19 వరకు నిర్వహించబడుతున్న ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య, మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, కృపారాణి, ఆంజనేయులు గురువారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వి. సరిత, ఫీల్డ్ కోఆర్డినేటర్ వి. పూజిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థులు చిన్నతనంలోనే జీవితానికి సంబంధించిన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని ఉపదేశించారు. ఈ శిబిరం బాలికల వ్యక్తిత్వ వికాసానికి, మార్గనిర్దేశానికి ఎంతో అనుకూలంగా సేవలందిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన అనంతరం ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ, వాయిస్ ఫర్ గర్ల్స్ కోఆర్డినేటర్ల సహకారంతో బాలికలు తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, తమకు తామే గొప్ప మార్గదర్శకులుగా ఎదిగే అవకాశాన్ని పొందుతున్నారని తెలియజేశారు. ప్రిన్సిపాల్ సరిత మాట్లాడుతూ.. ఇలాంటి శిబిరాలు బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారికి తమ హక్కులు, బాధ్యతల పట్ల స్పష్టతను కలిగిస్తాయని అన్నారు.

రిపోర్టింగ్ ఆఫీసర్‌లు అనుషా, పద్మావతి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ శిబిరంలో మొత్తం 166 మంది బాలికలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బాలికల భవిష్యత్తును మెరుగుపర్చే దిశగా, ఈ శిబిరంలో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, బాలికల హక్కులు, భద్రత, మరియు భవిష్యత్ ప్రణాళిక వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించబడుతుంది. కౌన్సిలర్‌లు హమైకా, నందిని, నవీనా, అక్షితతో పాటు ఫీల్డ్ కోఆర్డినేటర్ వి. పూజిత మాట్లాడుతూ, ఈ పది రోజుల శిక్షణలో బాలికలు తమ ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రత, భవిష్యత్ లక్ష్యాలు వంటి అంశాలను సమగ్రంగా నేర్చుకుంటున్నారని, ఇది వారి జీవితానికి బలమైన బాట చూపుతుందని తెలిపారు. స్థానికులు ఈ శిబిరాన్ని స్వాగతిస్తూ, “ఇది బాలికల్లో నూతన ఆశలను నింపే అద్భుత కార్యక్రమం” అంటూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -