Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీ వర్షం

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీ వర్షం

- Advertisement -

కాలనీల్లో మోకాళ్ల లోతు నీళ్లు, ఇబ్బందిపడ్డ ప్రజలు
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
ఆసిఫాబాద్‌లో బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకూ కురిసిన భారీ వర్షానికి పట్టణం అతలాకుతల మైంది. భారీ వర్షంతో జిల్లా కేంద్రాల్లోని బ్రాహ్మణవాడ, పైకాజినగర్‌, జూబ్లీ మార్కెట్‌ ప్రాంతాల్లోని రహదారులు మోకాళ్ల లోతు నీటితో కాలువలను తలపించాయి. డ్రయినేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. జిల్లాగా ఆవిర్భవించి ఎనిమిదేండ్లు, మున్సిపాలిటీగా ఆవిర్భవించి 18 నెలలు అవుతున్నప్పటికీ కనీస రహదారులు, డ్రయినేజీ వ్యవస్థ లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే ప్రజలు ఇబ్బంది పడుతు న్నారు. గురువారం కురిసిన భారీ వర్షానికి ప్రజల ఇబ్బందులు మరింత రెట్టింపయ్యాయి. మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి భారీగా నీరు నిల్వడంతో ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో కనీస రోడ్లు, డ్రయినేజీ వ్యవస్థపై అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని దృష్టి సారించకపోవడంపై జిల్లా ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారి కూడా గుంతలు ఉండటం వల్ల వాహన చోదకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ ప్రణాళిక అమలు చేస్తూ రోడ్లు, డ్రయినేజీలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -