Friday, September 19, 2025
E-PAPER
Homeకరీంనగర్వీర్నపల్లిలో గోదాం నిర్మాణంపై ప్రతిష్టంభన..

వీర్నపల్లిలో గోదాం నిర్మాణంపై ప్రతిష్టంభన..

- Advertisement -

– భూములు ఇచ్చేందుకు నిరాకరించిన ప్రజలు
నవతెలంగాణ-వీర్నపల్లి : వీర్నపల్లి మండలంలో ప్రతిపాదిత గోదాం నిర్మాణానికి సంబంధించి గురువారం జరిగిన సమావేశం భూసేకరణపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అర్ధాంతరంగా ముగిసింది. గోదాం నిర్మాణానికి అవసరమైన భూములను ఇచ్చేందుకు స్థానిక ప్రజలు స్పష్టంగా నిరాకరించారు.

2018లో గత ప్రభుత్వం హయాంలోనే ఈ గోదాం నిర్మాణానికి అనుమతి లభించగా, దీని కోసం ₹1 కోటి 80 లక్షల నిధులు కూడా మంజూరయ్యాయి. గిడ్డంగులు లేకపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడమే ఈ గోదాం ముఖ్య ఉద్దేశ్యం.

ఈ సమావేశాన్ని మార్కెట్ కమిటీ పాలకవర్గం నిర్వహించింది. ఇందులో తహశీల్దార్ ముక్తార్ పాషా, ఎస్సై లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, సెస్ డైరెక్టర్ మల్లేశంతో పాటు ఉమ్మడి వీర్నపల్లి, బావు సింగ్ తండా ప్రజలతో 

ఏఎంసీ పాలకవర్గం ప్రజలను గోదాం నిర్మాణానికి భూములు ఇవ్వాలని కోరగా, తమ భూములు జీవనాధారం అని, వాటిని ఇచ్చేది లేదని ప్రజలు దృఢంగా తెలిపారు. ఈ నేపథ్యంలో, ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి తహశీల్దార్ ముక్తార్ పాషా,ఎస్సై వేముల లక్ష్మన్, సెస్ డైరెక్టర్ మల్లేశం,ఏ ఏం సి చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -