Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పిఆర్టీయుతోనే  సాధ్యం..

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పిఆర్టీయుతోనే  సాధ్యం..

- Advertisement -

జిల్లా అధ్యక్షులు రేగూరి సుభాకర్ రెడ్డి..
నవతెలంగాణ – మల్హర్ రావు(మహముత్తారం)

గత రెండు సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి జడ్పీ జిపిఎఫ్ బిల్లులు, సరెండర్ లీవ్ బిల్లులు, టిఎస్ జిఎల్ఐ బిల్లులు, మెడికల్ బిల్లులతోపాటు ఇతర పదవి విరమణ పొందిన వారి బిల్లులు అన్ని తక్షణమే విడుదల చేయాలని పిఆర్టియు జిల్లా అధ్యక్షులు రేగూరి సుభాకర్ రెడ్డి  డిమాండ్ చేశారు. మహముత్తారం మండలంలో  ములుగుపల్లి ఉన్నత పాఠశాల మోడల్ స్కూల్ దొబ్బలపాడు స్తంభం పల్లి (పి పి )గిరిజన ఆశ్రమ పాఠశాల బోర్లగూడెం నిమ్మగూడెం యామన్ పల్లి కే జి బి వి మహా ముత్తారం మీనాజీ పేట ఉన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేశారు. మహాముత్తారం మండల అధ్యక్షుడు భుక్య రవి నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ప్రోగ్రెసివ్  రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రేగూరి సుభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ హాజరై సంఘ నిర్మాణం కొరకు ,రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పిఆర్టియు సంఘంలో సభ్యత్వం స్వీకరించాలని కోరారు.

ఉపాధ్యాయులందరికీ వెంటనే క్యాష్ లెస్ హెల్త్ కార్డులను  వచ్చేలా మన సంఘం కృషి చేస్తుందన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే సిపిఎస్ రద్దు అయ్యేలా త్వరలో సీఎంను కలిసి   సిపిఎస్ రద్దుచేసి వారికి పాత పెన్షన్ వర్తింపజేసేలా రాష్ట్ర సంఘం కృషి చేస్తుందన్నారు.అదేవిధంగా మిగిలిన సిపిఎస్ ఉపాధ్యాయులందరికీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలియజేసిన విధంగా అందరికీ సిపిఎస్ విధానాన్ని రద్దుచేస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలయ్యేలా ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి చేస్తారని తెలియజేశారు.అంతేకాకుండా బదిలీలతో కూడిన పదోన్నతుల షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలని, తద్వారా ఖాళీగా ఉన్న  ఉపాధ్యాయులను, గెజిటెడ్  హెడ్మాస్టర్ పోస్టులను లను భర్తీ చేయాలని కోరారు.ఉద్యోగులకు హక్కుగా 6 నెలలకు ఒకసారి రావాల్సిన డి ఏలు 5  పెండింగ్ లో ఉండడాన్ని తప్పు పడుతూ,  పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏలను వెంటనే మంజూరు చేయాలన్నారు.

రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సి ని మంచి  ఫిట్మెంట్ తో పిఆర్సి ప్రకటించి వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి, కుసుమ కృష్ణ మోహన్,జిల్లా బాధ్యులు దాసరి రాజేంద్ర ప్రసాద,పోతుల రమేష్ హనుమంత్ , మండల బాధ్యులు కొంకల గీతారెడ్డి నాగరాజు,సుధాకర్ రెడ్డి, హనుమంతు భాస్కర్ అయోధ్య లతోపాటు వివిధ మండల ,జిల్లా ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -