నిందితులను కఠినంగా శిక్షించాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల దరుహంకారంతోనే మల్లేశ్‌ను హత్య చేశారనీ, అందుకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్‌రావు పేటలో నలుగురి మల్లేష్ (26) అదే గ్రామానికి చెందిన బీసీ సామాజిక తరగతికి చెందిన యువతి కొన్నేండ్ల్లుగా ప్రేమలో ఉన్నారనీ, ఇది నేరంగా భావించిన యువతి తండ్రి, బాబాయి కత్తులతో దాడి చేసి అత్యంత దుర్మార్గం హత్య చేశారని తెలిపారు. కులదురహంకారంతోనే ఈ ఘటనకు పాల్పడ్డారని విమర్శించారు. కుల దురహంకార హత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిని అరికట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నదని విమర్శించారు. కులాంతర వివాహాలు చేసుకునే వారి రక్షణ కోసం ప్రత్యేక చట్ట తేవాలని డిమాండ్ చేశారు.