నవతెలంగాణ జడ్చర్ల: శ్రావణమాస ఉత్సవాలను పురస్కరించుకొని రంగనాయక స్వామి దేవాలయం పెద్దగుట్ట పై శ్రావణమాస ఉత్సవాలను 25 వ తేదీ నుండి 22/08/2025 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. పాత బజార్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉదయం 9:30 గంటలకు గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో అధ్యక్షులు కాల్వ రామ్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దర్శనం కోసం వాహనాలను ఏర్పాటు చేసాము 25వ తేదీ ఉదయం హనుమాన్ టెంపుల్ నుండి కళశాలతో గుట్ట పైకి నడుచుకుంటూ భజనలు కీర్తనలు పాడుకుంటూ వెళ్లి పూజ కార్యక్రమాలు చేస్తారు గుట్టపైన ప్రతి శనివారం ఆదివారం అన్న ప్రసాదం ఉంటుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రంగనాయక స్వామి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాము కార్యక్రమంలో నాయకులు పట్టణ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దగుట్ట రంగనాయక స్వామి శ్రావణమాస ఉత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES