Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల ప్రతీక బోనాలు..

తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల ప్రతీక బోనాలు..

- Advertisement -

– హొవార్డు ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ టి ఎస్ శశికళ
నవతెలంగాణ – నిజామాబాద్ : నగరంలోని స్థానిక న్యాల్కల్ రోడ్ రోటరీ నగర్ నందుగల హొవార్డ్ పాఠశాలలో శుక్రవారం ఘనంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పాఠశాల ప్రిన్సిపల్ టీఎస్ రత్న తేజ తెలిపారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల కరస్పాండెంట్ TVR మూర్తి , ప్రిన్సిపల్ డాక్టర్ టి ఎస్ శశికళ మాట్లాడుతూ భారతదేశం ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయాల కు నిలయమని దేశంలోని వివిధ రాష్ట్రాలలో అనేక రకాల పండుగలను జరుపుకుంటారని ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి బోనాలు అనునది సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని ప్రతి సంవత్సరం మన పాఠశాలలో బోనాలు కార్యక్రమాన్ని జరుపుకుంటారని నేడు కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగినదని ఈ కార్యక్రమంలో విశేషమేమనగా ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థుల మాతృమూర్తులనీ ఆహ్వానించి వారితో కలిసి బోనాలను భజన్త్రీలతో స్థానిక పిఎఫ్ ఆఫీస్ వద్ద గల పోచమ్మ మైసమ్మ దేవాలయంలో బోనం ను సమర్పించడం జరిగినది. ఇంతే కాకుండా వచ్చిన మాతృమూర్తులందరికీ కూడా పసుపు బొట్టులను అందించి సాంప్రదాయాలకు ధీటుగా పండుగ వాతావరణం లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినదని తెలిపారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాతృమూర్తులు అందరూ కూడా ఎంతో సంతోషించారని ఇంతే కాకుండా పసుపు బొట్టు కార్యక్రమం ఏర్పాటుపై అందించిన వస్తువులతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయం వెనుక ఉపాధ్యాయులందరి కృషి, చాలా ఉన్నదని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటంలో మాకు సహకరిస్తున్నటువంటి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -