పండగలపై ప్రజలకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం
డైరెక్టర్స్ లోకేష్ రెడ్డి, సంగీతారెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి
ఆషాఢ మాసం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అక్షర ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షరా పాఠశాల డైరెక్టర్స్ లోకేష్ రెడ్డి, సంగీతారెడ్డి లు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు పండగ సంప్రదాయాలపై అవగాహన కలిగించేందుకు ప్రతి పండగ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సంప్రదాయ బద్దంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సవాల్లో పాల్గొన్నారు, డప్పు చప్పుళ్ళు విద్యార్థులు పోతరాజు వేషధారణ, సంప్రదాయ వస్త్రాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ చైర్మన్ వెదిరె అశోక్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
అక్షర పాఠశాలలో ఆషాఢ బోనాలు జాతర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES