Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండ్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

అధికారులపై ఆగ్రహం..

మండలంలో 742 ఇండ్లు మంజూరు కాగా  ఇప్పటివరకు 83 ఇండ్లు మాత్రమే రౌండింగ్ కావడంతో అధికారులను పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో బుధవారం నాటికి 50% గ్రౌండింగ్ పూర్తి కావాలని లేనిపక్షంలో ఆయా గ్రామాల కార్యదర్శులు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇండ్ల నిర్మాణం పనుల పురోగతిపై గ్రామపంచాయతీలవారిగా కార్యదర్శులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు గ్రౌండింగ్ కానీ గ్రామాలలో వెంటనే ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి 

వనమహోత్సవం పై సమీక్షిస్తూ వనమహోత్సవం కింద మండలానికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం గుంతలతవ్వకం, మొక్కలు నాటడం సకాలంలో పూర్తి చేసి విజయవంతం చేయాలన్నారు.నాటిన మొక్కలన్నింటిని సంరక్షించాలని చెప్పారు. వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్,  ఎంపీడీవో పెరుమళ్ళ జ్ఞాన ప్రకాష్ రావు, మండల పంచాయతీ అధికారి స్వరూపారాణి,గ్రామపంచాయతీ కార్యదర్శులు జయప్రద, శ్రీధర్, పెద్దయ్య అశోక్ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -