- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి పట్టణ ప్రముఖ జర్నలిస్ట్ స్వర్గీయ ఏనుగు సురేష్ రెడ్డి కుమారుడు ఏనుగు నిఖిల్ రెడ్డి ఉన్నత చదువులకై ఆస్ట్రేలియా వెళ్తున్న సందర్భంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ , సురేష్ రెడ్డి మిత్ర బృందం నిఖిల్ రెడ్డిని కలిసి అభినందించి, ఆశీర్వదించి మా మిత్రుడు స్వర్గీయ సురేష్ రెడ్డి ఆశయాలను సమాజ సేవలో తండ్రి చూపించిన మార్గంలో నడవాలని కోరారు. ఈకార్యక్రమంలో మైమూద్ రహిమాన్, అనిల్ రెడ్డి, తంగళ్ళపల్లి వెంకటేశ్వర్లు ఎండి జిల్లాని, చిన్నగారి శ్రీనివాస్, పోతంశెట్టి వీరయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -