Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుటుంబ నియంత్రణ పద్ధతులను అనుసరించడం అభినందనీయం

కుటుంబ నియంత్రణ పద్ధతులను అనుసరించడం అభినందనీయం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలను డిఎంహెచ్వో కార్యాలయంలోని మీటింగ్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ తాత్కాలిక మరియు శాశ్వత పద్ధతులను అవలంబించడం హర్షనీయమని, ముఖ్యంగా తాత్కాలిక పద్ధతుల ద్వారా జనాభాను నియంత్రించవచ్చని, జనాభాను నియంత్రించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని మహిళలందరికీ అందించవచ్చు అని ముఖ్యంగా రక్తహీనత, మాతా శిశు మరణాలు, పోషకాహార లోపాన్ని, నిరుద్యోగ సమస్యను, తక్కువ బరువుతో పుట్టే శిశువుల ను, తగ్గించవచ్చని ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ తెలియజేశారు.

ఈ సందర్భంగా జనాభా నియంత్రణ పై మరియు తాత్కాలిక శాశ్వత పద్ధతులపై జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, పీహెచ్సీ స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు అదేవిధంగా గత సంవత్సరం నుండి కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించిన వారిలో మొదటిది ఒకే ఒక బిడ్డపై శాశ్వత కుటుంబ నియంత్రణ అవలంబించిన మసూరి ప్రమీల, సాంపల్లి, జక్రంపల్లి మండల్ వారికి ,రెండవది పి పి ఐ యు సి డి తాత్కాలిక పద్ధతులు అవలంబిస్తున్న తోకల స్వాతి రాయకోరు, పీఎస్సీ పోతంగల్ వారికి,మూడవది తాత్కాలిక కుటుంబ నియంత్రణ అంతర ఇంజక్షన్ తీసుకుంటున్న సిర్పంగి రోజా, రాజీవ్ నగర్, గౌతమ్ నగర్ యుపిఎస్సి వారికి ఈ ముగ్గురికి లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది.

రూ.1000 చెక్కును డిఎంహెచ్ఓ చేతుల మీదుగా పారితోషికం అందించడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సర కాలంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో కుటుంబ నియంత్రణ మరియు సంక్షేమ కార్యక్రమాల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులను సన్మానించడం జరిగింది, వీరిలో బెస్ట్ సర్జన్ డాక్టర్ ఎం రవీందర్ జక్రాన్ పల్లి. కృష్ణవేణి పీహెచ్ఎన్ పిహెచ్సి రుద్రూర్, కే సావిత్రి ఏఎన్ఎం పిఎస్సి బినోల, బి ఆనంద్ హెల్త్ అసిస్టెంట్ ఆర్మూర్, బి నాగమణి ఆశ పిహెచ్సి రుద్రూర్, సిహెచ్ పండరి హెల్త్ అసిస్టెంట్ పిహెచ్సి ఎర్గట్ల, వారికి మేమెంటో శాలువా ప్రశంసా పత్రంతో సత్కరించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో డిటిసిఓ దేవి నాగేశ్వరి, డిఎంఓ డాక్టర్ తుకారం రాథోడ్, పిఓఎన్సిడి డాక్టర్ సామ్రాట్ యాదవ్, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సుప్రియ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ రవీందర్, ఏవో రాజేశ్వర్, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు,డిపిహెచ్ఎన్ఓ స్వామి సులోచన, డీఎస్ఓ హరినాథ్ బాబు అనురాధ వివిధ యుపిఎస్సి ల నుండి ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -