- Advertisement -
ఊరువాడను సల్లంగజూసే దేవుళ్లే గ్రామదేవతలు
మశూచి మహమ్మారిని తరిమేయమని
ఉజ్జయినీ అమ్మవారిని కోరిన సైనికులప్రార్థనలకు ఆనవాళ్లే ఈ బోనాలు
మట్టికుండకు పసుపురాసి
వేపాకులను అంచులకు కట్టి
బంతిపూలమాలలతో అలంకరించి
కుంకుమ బొట్లనుదిద్ది దీపాన్ని వెలిగించి
పరమాన్నపు ప్రసాద ఘటాలతో పడుతుల ఊరేగింపులతో కళకళలాడే జాతర
శివసత్తుల పూనకాలు
పోతురాజు కొరడావిన్యాసాలు
డప్పులచప్పుళ్లతో ఊరంతా సంబరమే
రంగమెక్కిన దేవారల భవిష్యవాణి
కాపాడుతల్లీ యంటూ జనుల వేడుకోళ్లు
ఆషాఢమాసాన అంటువ్యాధుల నివారణే
ఈ పండుగ ప్రాశస్త్యం..!
వేపాకు కిటకనాశిని
పసుపు రోగనిరోధక లేపనం..!!
– అయిత అనిత, 8985348424
- Advertisement -