Sunday, July 20, 2025
E-PAPER
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

ఊరుకుంటారా?!
శిష్యుడు : అసలు మగాడంటేనే మిర్చిలాగా ఘాటుగా, కారంగా ఉండాలి కదా గురువుగారూ.
గురువు : నిజమే కానీ శిష్యా, మరీ అంత ఘాటుగా, కారంగా వున్న మిర్చిని ఈ ఆడాళ్ళు పచ్చడి చేయకుండా ఊరుకోరు కదా!

భలే కస్టమర్‌
అప్పారావు : బ్యాంక్‌ కస్టమర్స్‌ డే రోజు ఒక బిక్షగాణ్ణి సన్మానిస్తున్నారేంటి?
బ్యాంక్‌ మేనేజర్‌ : ఆ మహానుభావుడేగా మా రెగ్యులర్‌ కస్టమర్‌.

పెద్దయ్యాక…
మంత్రి భార్య : ఏవండీ, మనవాడికి అచ్చం మీ చిన్ననాటి పోలికలే వచ్చినట్లున్నాయి. పొట్టకోస్తే అక్షరం ముక్క రావడం లేదు.
మంత్రి : భయపడకులేవే. వాడు కూడా పెద్దయ్యాక నాలాగే విద్యాశాఖ మంత్రి అవుతాడేమో!

అలా కుదరదు
ఎల్లమ్మ : భోజనం బాగోలేదంటూ అబ్బాయి ఉత్తరం రాశాడండీ.
తిక్కన్న : అలాంటప్పుడు వేరే హోటల్‌కెళ్ళి తినొచ్చు కదా?
ఎల్లమ్మ : అలా తినడం జైల్లో కుదరదటండి.

చూస్తే కదా తెలిసేది
ప్రసాద్‌ : సినిమా చూస్తూ ఎందుకు అందరూ చప్పట్లు కొడుతున్నారు? ఈ సినిమా అంత నచ్చిందా?
కిరణ్‌ : సినిమా థియేటర్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి. అవి కుడుతుంటే వాటిని చంపుతున్నారు. అసలు సినిమా చూస్తేనే కదా బాగుందో లేదో తెలియడానికి!

ముందు చూసుకోవద్దూ…
మొదటి దొంగ : గోడ దూకి ఇంట్లోకి వెళ్లావు కదా! ఏం దొరికింది?
రెండో దొంగ : ఏమీ దొరకలేదు
మొదటి దొంగ : ఎందుకని?
రెండో దొంగ : బయటకొచ్చాక చూశా ఇంటి ముందు టులెట్‌ బోర్డును.

చిన్నప్పటిది
టూరిస్ట్‌ : ఈ కలేబరం ఎవరిది?
వెంగళప్ప : టిప్పు సుల్తాన్‌ది.
టూరిస్ట్‌ : ఈ పక్కనున్న చిన్న కలేబరం ఎవరిది.
వెంగళప్ప : టిప్పుసుల్తాన్‌దే తను చిన్నగా ఉన్నప్పటిది.

కమీషన్‌
సీనియర్‌ డాక్టర్‌ : నేను జ్వరానికి మూడు రకాల టాబ్లెట్లు రాస్తే, నువ్వెందుకు ఐదు రకాల టాబ్లెట్లు రాస్తున్నావ్‌?
జూనియర్‌ డాక్టర్‌ : మెడిసిన్‌లపై ముప్పై శాతం కమీషన్‌ వస్తున్నప్పుడు ఆ మాత్రం మందులు రాయాలనిపించదా చెప్పండి.

నో కన్సెషన్‌
క్లయింట్‌ : లాయర్‌ గారూ… ఒక ప్రశ్నకు ఎంత ఫీజు తీసుకుంటారు?
లాయర్‌ : ప్రశ్నకు రెండొందలు.
క్లయింట్‌ : కన్సెషన్‌ ఏమైనా ఉందా?
లాయర్‌ : ఏమీ లేదు. ఈ రెండు ప్రశ్నలకు కలిపి నాలుగొందలు ఇవ్వండి.

జీడిపాకం
పొరుగింటావిడ : మీ పాపకు రోజూ ‘వారసులు – వారసత్వం’ సీరియల్‌ చూపిస్తూ అన్నం పెడుతున్నారెందుకు?
ఇరుగింటావిడ : నేను కూడా చిన్నప్పుడు ఈ సీరియల్‌ చూసే అన్నం తినేదాన్ని. అందుకే.

బాస్‌ మాట
ఇంటర్వ్యూ అధికారి : నువ్వు పాత కంపెనీలో ఉద్యోగం ఎందుకు మానుకున్నావ్‌?
వికాస్‌ : బాస్‌ మాటను మన్నించాలి కదా అందుకని!
ఇంటర్వ్యూ అధికారి : ఏం చెప్పాడేమిటి ఆ బాస్‌?
వికాస్‌ : ఉద్యోగం నుంచి తొలగించాం మాట్లాడకుండా వెళ్లు అని చెప్పాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -