Sunday, July 20, 2025
E-PAPER
Homeకవితస్వేచ్ఛా గీతం

స్వేచ్ఛా గీతం

- Advertisement -

రాబందులు, హైనాలు
గద్దలు, గుంటనక్కలు
రాజ్యం ఏలుతున్న ఈ భూమండలం మీద
ఎలా స్వేచ్ఛగా వుండాలని
అనుకుంటున్నావు తల్లీ?
అరణ్యాల్లో వుండాల్సిన మృగాలు
మనుషుల రూపాల్లో తిరుగుతున్నాయి
ఈ కాంక్రీట్‌ జంగిల్లో
అవి కార్లలో, రెండు చక్రాల బండ్ల మీద
తిరుగాడుతూనే వున్నాయి… వుంటాయి
అని చెప్పావు గద తల్లీ!!
అందుకే ఎవరెలాంటి వారో
కొంచెం గమనించి నడుచుకో చెల్లీ!
మనసున్న మనషుల మధ్య
మంచిగా మసలుకోమని తెలియజెప్పావు
ఏమి సాధించావని? ఎవర్ని సాధించాలని?
ఆత్మీయులు ఎవరూలేని లోకంలోకి
ఎగిరిపోయావా బంగారు తల్లీ!!
– భాస్కర్‌ కె.ఎన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -