పద్నాలుగేళ్ల బాలుడు మిగతా పిల్లల్లా కాదు, క్లాస్‌లో వెనుక కూర్చుంటాడు. బుక్ తీసి చూడడు, ఎవరు చెప్పినా వినడు. అతని తల్లి కన్నీళ్ళతో ఇలా చెప్పారు… ”మేడం, మేమంతా ఎంతో చెప్పాం. టీచర్లు కూడా ఒదిలేశారు. ఏం చేస్తాడో అర్థం కావడం లేదు…”
నేను ఆ బాలుడిని పిలిచాను. అతను మాట్లాడకుండా కూర్చున్నాడు… ముఖం కిందకు, చేతులు మడుచుకుని.
నేను కేవలం ఇలా చెప్పాను… ”ఒక్కసారి నువ్వే నీ గురించి చెప్పుకుంటే నేను తెలుసుకుంటాను” అని.
అతను నన్నే చూస్తూ అన్నాడు… ”నాకు అందరూ ఏం చెయ్యాలో చెప్పేస్తారు. కానీ మీరు నన్నే చెప్పమంటారా?”
అవును అని చిరునవ్వుతో తల ఊపాను. మరుసటి రోజు అతడే తన చేతుల్లో బుక్ పట్టుకుని వచ్చాడు. తానే చదవడం మొదలుపెట్టాడు. తానే చెప్పడం మొదలుపెట్టాడు.. ”అక్కా, నాన్న, టీచర్ ఇలా చెప్పారు. కానీ నేను ఏం చేయాలో నేను నేర్చుకుంటాను” అని.
ఆ రోజు నాకు మరో మానసిక సిద్ధాంతం గుర్తొచ్చింది… ‘ఔష్ట్రవఅ a షష్ట్రఱశ్రీస టవవశ్రీర శీషఅవతీరష్ట్రఱజూ, షష్ట్రaఅస్త్రవ bవస్త్రఱఅర’.
బలవంతంగా చదివించలేరు. అతనికే అర్థమయ్యేలా చేస్తే – మార్పు జరుగుతుంది.
ఈ బాలుడి జీవితం తల్లిదండ్రుల చేతుల్లో లేదు. తానే తన జీవితం పట్ల నిర్ణయం తీసుకున్నాడు.
ఇది ఆతని మొదటి విజయం. చిన్నదైనా చైతన్యాన్ని నింపేదిగా ఉంది.
తల్లి దండ్రుల ఆశలు విత్తనాలు. పిల్లల సంకల్పమే వక్షం.
మన పిల్లలు విజయవంతమైన జీవితం గడపాలని తల్లిదండ్రులుగా మనందరికీ కోరిక ఉంటుంది. అందుకోసమే భౌతికంగా అవసరమైనవన్నీ సమకూర్చే ప్రయత్నం చేస్తాం. మంచి విద్య, ఆహారం, ఆరోగ్యం, భద్రత.
కానీ ఒక ఆవేశభరితమైన ప్రశ్న మన మనస్సులో….
ఈ భవిష్యత్తు వారు నిజంగా పొందుతారా? లేదా నిర్మించుకుంటారా?
వారి చేతుల్లో భవిష్యత్తు ఎందుకు ఉంది?
అందించిన అవకాశం ఎలా వినియోగించుకోవాలనేది పిల్లలపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు విత్తనాలు నాటగలరు, నీళ్లు పోయగలరు. కానీ మొలకెత్తి పుష్పించేది, ఫలించేది ఆ విత్తనంలో ఉన్న ప్రాణశక్తితోనే.
అదే విధంగా పిల్లల్లో ఉన్న స్వప్నశక్తి , నిర్ణయశక్తి , ఆత్మవిశ్వాసం అనేవి వారి జీవితాన్ని నిర్మించే ప్రధాన మానసిక ఆధారాలు.
ఎ సైకాలజీలోని ముఖ్యమైన సూత్రం – స్వీయ నియంత్రణ
పిల్లల వ్యక్తిత్వ వికాసానికి అత్యంత కీలకమైన అంశం. అంటే తాము ఏం చేయాలో తెలుసుకోవడం, ఎప్పుడు చేయాలో నిర్ణయించడం, ఎలా చేయాలో పట్టుదలగా ముందుకెళ్లడం.
ఈ సామర్థ్యం పెరిగితేనే వారు ఏ వాతావరణంలోనైనా ఎదగగలరు. ఇది చిన్నప్పటి నుంచే అభ్యాసంతో వస్తుంది. బలవంతంగా కాదు, ప్రేరణతో.
సామాజిక ఒత్తిళ్లకు లోనవకుండా
నేటి పిల్లలు ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. సమాజపు అంచనాలు, చదువులో రేటింగులు, సాంకేతిక మత్తు, స్నేహితుల పోటీ.
ఈ నేపథ్యంలో పిల్లలు తాము ఎవరో తెలుసుకోవడం, తాము ఎలా మారాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోవడం చాలా అవసరం.
అలజడిని భరించిన మనస్సే విజయాన్నీ సాధించగలదు. ఇది పిల్లలకే సాధ్యమవుతుంది – వారు ప్రయత్నిస్తే.
తల్లిదండ్రులు – మార్గదర్శకులు, మానవతా దీపాలు
పిల్లలకు జీవితాన్ని తల్లి దండ్రులు సిద్ధం చేయలేరు, కానీ వారు చూపే విలువలు, ఇచ్చే ప్రేమ, చూపించే ఓర్పు పిల్లలకు మార్గంగా నిలుస్తాయి. తల్లిదండ్రులు మార్గాన్ని చూపించగలరు కానీ నడవాల్సింది మాత్రం పిల్లలే.
పిల్లలు దెబ్బలు తగిలించు కుంటారు, తప్పులు చేస్తారు, కానీ ఆ ప్రయాణం వారిదే. మానవ సంబంధాల్లో పిల్లలు అనుభూతి చెందే మొదటి ప్రేమ, మొదటి భయం, మొదటి నిరాకరణ – ఇవన్నీ వారి అంతర్మధనాలకు బీజాలు వేస్తాయి.
అందుకే తల్లిదండ్రుల పాత్ర పరిపూర్ణత ఇవ్వడం కాదు, పరిపక్వతకు దారితీయడం. భవిష్యత్తును తయారుచేసుకునే శక్తి పిల్లలలోనే ఉంది.
పెరగుతున్న పిల్లల్లో పరిపక్వత
ప్రేమతో కూడిన శిక్షణ పిల్లల మానసిక స్థైర్యానికి పునాది. అయితే ఒక స్థాయికి వచ్చాక పిల్లలు తమ మనస్సుతో, తమ ఆలోచనలతో, తామే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారు చేసే ప్రతి ఎంపిక, వారి వ్యక్తిత్వాన్ని, మార్గాన్ని, జీవనపద్ధతిని నిర్ణయిస్తుంది.
పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లో ఉంది అనే మాట – భయానికి సూచిక కాదు, ఆశకు సంకేతం.
వారి చేతుల్లో భవిష్యత్తు ఉండటం వల్లే, వారు అది తమ స్వరూపాన్ని ప్రతిబింబించేటట్లుగా తీర్చిదిద్దుకోగలరు.
మనం వారికొక మంచి మానసిక వాతావరణాన్ని ఇవ్వగలిగితే వారు ఎడారినైనా ఉద్యానవనంగా మార్చగలరు.
వారిలోని చిన్న చిరునవ్వు ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించగలదని మనం నమ్మాలి. ఎందుకంటే…
పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు నిర్మించలేరు కాని ప్రేరణనిచ్చే బలమైన తోడుగా ఉండగలరు.
మనం ఒకప్పుడు చూసిన కల, వారు నిజం చేస్తారు. పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. మనం వారికిచ్చేది ఒక ప్రారంభం మాత్రమే. వారు అందిపుచ్చుకునేది ఒక సంపూర్ణ జీవితమే.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్
పిల్లల భవిష్యత్తు వారిచేతిలోనే…
- Advertisement -
- Advertisement -