Sunday, July 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరూ.14లక్షల కోట్లతో..

రూ.14లక్షల కోట్లతో..

- Advertisement -

చైనా ‘మెగా డ్యామ్‌’ పనులు ప్రారంభం
షాంఘై
: ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. శనివారం మొదలైన ఈ ప్రాజెక్టు పనుల కార్యక్రమంలో చైనా ప్రధాని లీ కియాంగ్‌ పాల్గొన్నారు. టిబెట్‌లోని యార్లంగ్‌ జాంగ్బో (బ్రహ్మపుత్ర) నదిపై చేపడుతోన్న ఈ వివాదాస్పద ప్రాజెక్టు కోసం డ్రాగన్‌ దాదాపు 1.2 ట్రిలియన్‌ యువాన్‌లు (సుమారు రూ.14లక్షల కోట్లు) ఖర్చు పెట్టనున్నట్టు అంచనా. ఈ ప్రాజెక్టుపై భారత్‌, బంగ్లాదేశ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ డ్రాగన్‌ మాత్రం మొండిగా ముందుకు పోతున్నట్టు కనిపిస్తోంది.’చైనా యాజియాంగ్‌ గ్రూపు’ పేరుతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసి.. ఈ ప్రాజెక్టు బాధ్యతలు దీనికి అప్పజెప్పినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం ఐదు డ్యామ్‌లు ఉండనున్నాయి. టిబెట్‌లోని నైంగ్చీ నగరంలో.. భారీ స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా దీన్ని చేపడుతున్నారు. ఈ విద్యుత్‌ను బయటకే సరఫరా చేయనున్నప్పటికీ స్థానిక అవసరాలకు కూడా కొంతమేర వినియోగించనున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టు..
భారీ ఖర్చుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలువనుంది. దీనిద్వారా ఏటా 300 బిలియన్‌ కిలోవాట్‌-అవర్స్‌ విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఇది చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలో అతిపెద్దదైన త్రీగోర్జెస్‌ డ్యామ్‌కన్నా మూడురెట్లు భారీది. బ్రహ్మపుత్ర నది ‘గ్రేట్‌ బెండ్‌’గా పిలిచే భారీ వంపు ప్రాంతంలో రెండువేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. స్వల్పదూరంలో నిటారుగా పడటంవల్ల అక్కడ జల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశాలున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -