116 మంది పైగా మృతి
గాజా : యుద్ధోన్మాద ఇజ్రాయిల్ గాజాలో అమానవీయ దాడులను కొనసాగిస్తూనేవుంది. అంతర్జాతీయ సమాజ దాతృత్వంతో ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాలను, సహాయక శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ సైనిక బలగాలు శనివారం భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 116 మంది పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. వీరిలో రఫాలో ఆహారం కోసం నిల్చున్నవారిలో 37 మంది మృతి చెందారు. వేలాది మంది పాలస్తీనియన్లు గాజాలో ఆకలితో అలమటిస్తున్నారని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) తెలిపింది. ఇదిలా ఉండగా కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ ప్రతిపాదించగా.. ఇజ్రాయిల్ తిరస్క రించింది. కాగా, ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల్లో.. 58,765 మంది మృతి చెందారు. 140,485 మంది గాయాలపాలయ్యారు. అనధికారంగా చాలా మందే చనిపోయారు.
గాజాలోఆహార పంపిణీ, సహాయక శిబిరాలపై ఇజ్రాయిల్ అమానవీయ దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES