- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. లాస్ ఏంజెలెస్‌లోని ఒక నైట్‌క్లబ్ ఎదుట ఉన్న జనాలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 30మందికిపైగా గాయాలైయ్యాయి. బాధితులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బాధితులలో 18 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. దాడి వెనుక ఉగ్రకుట్ర ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని, విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
- Advertisement -