నవతెలంగాణ-హైదరాబాద్: రేపట్నుంచి వర్షకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభకానున్నాయి. వచ్చే నెల ఆగష్టు 21 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తాజాగా ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో అన్ని పక్షాల సమావేశం జరగనుంది. పార్లమెంట్ హాల్‌లోని ఉదయం 11గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. నిన్న ఇండియా కూటమి పార్టీలు వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి 24 రాజకీయ పార్టీలు హాజరైయ్యాయి. పహెల్గాం ఉగ్రదాడి , ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ వ్యాఖ్యలు, బిహార్ లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, డీలిమిటేషన్, జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా, మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, నిరుద్యోగం, రైతుల సమస్యలు వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తేందుకు కూటమిలోని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో నెల రోజలపాటు జరిగే పార్లమెంట్ సమావేశాలు ఈసారి రసవత్తరంగా సాగనున్నాయి.
ఇవాళ ప్రతిపక్షాలతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కీలక భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES