నవతెలంగాణ-హైదరాబాద్: దేశానికి రైతన్న వెన్నముక అనే వ్యాఖ్యలు సత్యదూరం కాదు. ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత వేసధారణను చూసి, తక్కువ అంచనా వేసి కొందరు వారిని అవహేళన చేస్తుంటారు. అలాంటి వారిలో ప్రభుత్వ కొలువుల్లో ఉన్న ఉన్నతాధికారులు ఉండటం సిగ్గు చేటు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రామైన బీహార్ లో శాంతిభద్రతలు అదుపు తప్పి పలు రోజులుగా హత్యలు పెరిగిపోతున్నాయి. హతంకులను పట్టుకునే విషయంలో విఫమైన ఆ రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (అడిగి) కుండం కృష్ణన్ సహనం కోల్పోయారు. మార్చి నుంచి మే నెలల మధ్యనే అత్యధిక హత్యలు జరుగుతున్నాయని, దీనికి వ్యవసాయదారులై కారణమని నోరుపారేసుకున్నారు. పనిలేనికాలంలో కాంట్రాక్ట్ కిల్లర్లుగా అవతారమెత్తున్నారని, డబ్బుల కోసం, ఉపాధి కోసం మనుషులను చంపుతున్నారని ఏడీజీ కుండం కృష్ణన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై అన్నదాతలు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఏడీజీ వ్యాఖ్యలపై రోజురోజకు విమర్శలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో తాజాగా తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతున్నట్లు ఏడీజీ కుండం కృష్ణన్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. రైతులను అవమానించడం తన ఉద్దేశం కాదని, అన్నదాతలంటే తనకు ఎనలేని గౌరవమని, తన మాటలను తప్పుగా ప్రచారం చేశారని రాసుకొచ్చారు. తన మాటలతోవారి మనోభావాలు దెబ్బతింటే..అందుకు క్షమాపణ కోరుతున్నట్లు పోస్టు పెట్టారు.
గతంలో పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని, అందుకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక చట్టం చేయాలని నెలల తరబడి దేశరాజధాని సరిహద్దుల్లో టెంట్లు వేసుకొని మరీ రైతులందరూ ధర్నాలు చేపట్టిన విషయం తెలిసిందే.. దీంతో ఆగ్రహించిన బీజేపీ ప్రభుత్వం..అన్నదాతలపై నిర్భంధకాండలను విధించించి, భద్రతా బలగాలతో అణచివేత చర్యలకు పూనుకుంది. అయితే హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి ఎంపీ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన బీజేపీ ప్రతినిధి కంగనా రనౌత్ అన్నదాతల ధర్నాపై అనుచితంగా మాట్లాడారు. వంద, రెండు వందల కోసం రైతులు రోడ్లమీద నిరసనలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. దీంతో ఓ రైతు బిడ్డా ఓ ఎయిర్‌పోర్టులో ఎంపీ కంగనాకు తగిన బుద్ది చెప్పిన విషయం తెలిసిందే.