Sunday, July 20, 2025
E-PAPER
Homeజాతీయంతెలంగాణలోని ఆ 3 జిల్లాలకు రూ.100 కోట్లు..

తెలంగాణలోని ఆ 3 జిల్లాలకు రూ.100 కోట్లు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: తెలంగాణలోని మూడు జిల్లాలకు కేంద్రం రూ. 100 కోట్లు విడుదల చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు ఈ నిధులు విడుదల చేశారు. 2021-22లో దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా 12 రాష్ట్రాల్లో వర్షాభావ తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలను కేంద్రం గుర్తించగా.. తెలంగాణ నుంచి ఈ మూడు జిల్లాలను ఎంపిక చేసింది. ఈ జిల్లాల్లో కరవు నివారణ చర్యల కోసం 15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు జాతీయ విపత్తు నివారణ నిధి (NDRF) కింద కేంద్రం రూ.100 కోట్లను కేటాయించింది.

ఈ నిధులను ఆయా జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థ బలోపేతం, పర్యావరణ మద్దతు, గ్రామీణ రైతు కుటుంబాల ఆదాయ భద్రత చర్యలకు వినియోగించాలని నిర్దేశించింది. కేంద్రం కేటాయించిన రూ.100 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా మరో రూ.50 కోట్లు కలిపి, మొత్తం రూ.150.87 కోట్ల వ్యయంతో కరవు నివారణ, అనుసరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించింది. తాజాగా నిధులు విడుదల కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కలిపి ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేటాయించిన మొత్తం రూ.150.87 కోట్లను వివిధ విభాగాలకు ఈ క్రింది విధంగా వెచ్చిస్తారు. మౌలిక వసతులు, శిక్షణ, సాంకేతిక, అమలు సంస్థల ఖర్చులకు రూ.10 కోట్లు వెచ్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -