నవతెలంగాణ – మద్నూర్
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమై నెల 15 రోజులు అవుతున్నా.. సరైన వర్షాలు పడలేక చెరువుల్లోకి చుక్క నీరు రాక వెలవెలబోతున్నాయి. పంటల సాగు సమయంలో వర్షాలు అనుకూలించినప్పటికీ సాగు చేసిన అనంతరం పంటలు ఎదిగే సమయంలో వర్షాలు పడడం లేక రైతన్నలకు ఆందోళన కలిగిస్తుంది. రైతులు లక్షలు ఖర్చు పెట్టి పంటలు వేస్తున్నారు. కానీ ఏడాది వర్షాలు కురవకపోగా.. పంట చేతుకు వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.25వేలు కౌలు పెట్టుబడులు పెట్టి, చివరకికి వర్షం కోసం ఎదురు చూడవలసిన దుస్థితి ఏర్పడుతుంది. సరైన సమయంలో వర్షాలు పడనందున పంటలు ఎదగడం లేదు. చెరువుకుంటల్లో చుక్కనీరు రాక పశువులకు త్రాగటానికి నీరు కరువయ్యాయి. భారీ వర్షాలు పడితే గాని చెరువుల్లోకి నీరు వచ్చే విధంగా కనిపించడం లేదు. వరుణుడు కరుణించాలని వ్యవసాయదారులు గ్రామ దేవతలకు మొక్కుకుంటున్నారు.
వర్షాలు లేక వెలవెలబోతున్న చెరువులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES