Monday, July 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండోనేషియా నౌకలో అగ్ని ప్రమాదం

ఇండోనేషియా నౌకలో అగ్ని ప్రమాదం

- Advertisement -

ఐదుగురు మృతి.. అందులో ఓ గర్భిణీ ఉన్నట్టు గుర్తింపు
షిప్‌లో 280 మంది..దట్టమైన పొగతో సముద్రంలోకి జంప్‌
రక్షించిన రెస్క్యూ బృందాలు
ఇండోనేషియా
: ఇండోనేషియాలోని తలిసే ద్వీపానికి సమీపంలో సముద్రంలో ప్రయా ణిస్తున్న కేఎం బార్సిలోనా వీఏ పాసింజర్‌ నౌకలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అందులో ఓ గర్భిణీ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తలౌడ్‌ నుంచి ఉత్తర సులవేసి ప్రావిన్సు రాజధాని మనాడోకు ఈ నౌక బయలుదేరింది. ఆదివారం మధ్యాహ్నం తలిసే ద్వీపానికి చేరుకున్న సమయంలో నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రయాణికులు సముద్రంలోకి దూకేశారు. ఆ సమయంలో నౌకలో 280 మంది ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ప్రయాణికులు సముద్రంలోకి దూకే సమయంలో సేఫ్టీ జాకెట్లు ధరించి ఉన్నారు. ఈ క్రమంలోనే రెస్క్యూ బృందాలు చాలా మందిని రక్షించి ఒడ్డుకు చేర్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఈ ఘటనలో ఎంత మంది మరణించారు. ఎందరు గల్లంతయ్యారు? అనే వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -