విమానం ఇంజిన్‌లో మంటలు
గాలిలో ఉండగానే ప్రమాదం
లాస్‌ఏంజెల్స్ : విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ నెల 18న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాళ్లోకెళ్తే.. డెల్టా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్ 767-400 విమానం లాస్‌ఏంజెల్స్ నుంచి అట్లాంటాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సమస్య ఎదురైంది. ఎడమవైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎయిర్‌పోర్టు సిబ్బందికి సమాచారం ఇచ్చి.. విమానాన్ని వెనక్కి మళ్లించారు. లాస్‌ఏంజెల్స్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రన్‌వేపైకి వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది.
డెల్టా ఎయిర్‌లైన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES