7 మంది పర్యాటకులు మృతి
హనోయి : వియత్నాంలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకుల బోటు బోల్తా పడటంతో 37 మంది మరణించినట్టు స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం .. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఉత్తర వియత్నాంలోని క్వాంగ్ నిన్హ్ ప్రావిన్స్‌లోని హాలాంగ్ బే వెళుతుండగా అకస్మాత్తుగా ఉరుములతో భారీ వర్షం కురిసింది. దీంతో బోటు బోల్తాపడినట్టు వియత్నాం మీడియా తెలిపింది. ఆ సమయంలో బోటులో 48 పర్యాటకులతో పాటు ఐదుగురు సిబ్బంది ఉన్నారు. 47 మందిలో పది మందిని రక్షించగా, 37 మంది మరణించినట్టు తెలిపింది. మృతుల్లో 20 మందికి పైగా చిన్నారులు ఉన్నట్టు పేర్కొంది. నలుగురు బాధితులను గుర్తించాల్సి వుందని తెలిపింది. ప్రయాణికుల్లో అధిక భాగం హనోయి నుంచి వచ్చినట్టు సమాచారం. జులై 20 (ఆదివారం) తెల్లవారుజామున విన్హ్‌జాన్హ్ 58 పర్యాటక బోటును ఒడ్డుకు తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంపై వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ అత్యవసర ప్రకటన జారీ చేశారు. రక్షణ శాఖ, ప్రజా భద్రతా శాఖ మరియు ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, స్థానిక అధికారుల సమన్వయంతో సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.
వియత్నాంలో బోటు బోల్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES