నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమ కాలవకు ఆదివారం అధికారులు నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏఈ విజయకుమార్, సిబ్బంది నీటిని విడుదల చేశారు. వారం రోజుల కింద ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌కు 1.7 టీఎంసీల నీటిని డ్యామ్ అధికారులు విడుదల చేశారు. ఈ నీటినినల్లగొండ జిల్లా పరిధిలో తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నామని అధికారులు చెప్పినా పాలేరు రిజర్వాయర్ పరిధిలోని రైతాంగం నారుమడులు పోసుకోవడానికి వినియోగించుకున్నారు. దాంతో ఆదివారం ఉదయం 9.30 గంటలకు 1000 క్యూసెక్కులను డ్యామ్ అధికారులు విడుదల చేశారు. క్రమేణా వాటిని 2000 క్యూసెక్కుల వరకు పెంచి విడుదల చేయనున్నారు. ఆగస్టు ఒకటో తేదీన పూర్తిస్థాయిలో ఎడమ కాలువకు సాగునీటి అవసరాల నిమిత్తం మంత్రులు నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES