- Advertisement -
సీఐటీయూ ఖండన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విద్యుత్ సంస్థల్లో సమ్మె నిషేధ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటనలో ఖండించారు. సమ్మె నిషేధించటమంటే కార్మికులు, ఉద్యోగుల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. సమ్మె నిషేధ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఆరునెలలపాటు సమ్మెను నిషేధిస్తూ విద్యుత్ సంస్థల్లో యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. వానాకాలంలో కార్మికులు సమ్మె చేయడం వల్ల రైతులకు కరెంట్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది.
- Advertisement -