- Advertisement -
– డాక్టర్ అచ్యుత సమంత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమాజంలో మార్పు రావడంలో విద్య కీలకమని డాక్టర్ అచ్యుత సమంత తెలిపారు. విద్య, సామాజిక మార్పు కోసం ఆయన చేసిన కృషికిగాను రహరలోని రామకృష్ణ మిషన్ వివేకానంద సెంటినరీ కాలేజ్ ఆయనకు లైఫ్‌టైం అఛీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. ప్రొఫెసర్ సమంత ఆయన సంస్థల ద్వారా 80 వేల మంది పేదలకు ఆహారం, వసతి, అభ్యసన అవకాశాలను అందజేస్తున్నారు. ఈ అవార్డును అణగారిన పేద విద్యార్థులకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. అవార్డు గ్రహీతను కిస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డెబాసిష్ బందోపాధ్యారు, కాలేజీ ప్రిన్సిపాల్ స్వామి కమలాస్థానంద ప్రత్యేకంగా అభినందించారు.
- Advertisement -