Wednesday, July 23, 2025
E-PAPER
Homeజాతీయంమాతా వైష్ణో దేవి ఆలయా మార్గంలో విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు

మాతా వైష్ణో దేవి ఆలయా మార్గంలో విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: జమ్ము కశ్మీర్‌ లోని రియాసి జిల్లాలో గల పవిత్ర మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. బంగంగా ప్రాంత సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జమ్ము కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు కత్రా నుంచి భవన్‌కు వెళ్లే పాత యాత్ర మార్గంలోని బంగంగా ప్రాంతం గుల్షన్ కా లంగర్ వద్ద ఉదయం 8 గంటల సమయంలో కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 10 మంది భక్తులు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఈ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించింది. మరోవైపు శిథిలాల కింద ఇంకెవరైనా చిక్కుకుపోయారా అన్న అనుమానంతో అక్కడ గాలింపు చేపడుతున్నారు. ఈ ఘటనలో యాత్ర మార్గంలో నిర్మించిన షెల్టర్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -