Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeజాతీయంపిల్లల పేర్లతో తమిళంలో వెబ్‌సైట్..

పిల్లల పేర్లతో తమిళంలో వెబ్‌సైట్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పిల్లలకు పెట్టడానికి తమిళ పేర్లు, వాటి అర్థ వివరణలతో కూడిన ప్రత్యేక వెబ్‌సైట్ను ప్రారంభించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ప్రకటించారు. డీఎంకే నాయకులు, కార్యకర్తల ఇంటి శుభకార్యాలకు హాజరయ్యే ముఖ్యమంత్రి స్టాలిన్‌.. పుట్టబోయే పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టాలంటూ కుటుంబీకులకు సూచించడం పరిపాటి. చెన్నైలో బుధవారం జరిగిన డీఎంకే ఎమ్మెల్యే వేలు కుమార్తె పెళ్లి కార్యక్రమంలోనూ ఇదే ఆకాంక్షను వెల్లడించారు. ఈ వీడియోను ఒకరు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ.. పిల్లలకు తమిళ పేర్లు పెట్టాలనుకున్నా తమిళ పేర్లు, వాటికి అర్థ వివరణలు తెలుసుకునేందుకు సరైన వెబ్సైట్లు లేవని పేర్కొన్నారు. ఇందుకోసం తమిళ అభివృద్ధి శాఖ లేక తమిళ్‌ వర్చువల్‌ అకాడమీ ద్వారా వెబ్సైట్ రూపొందిస్తే బాగుంటుందని తెలిపారు. దీనికి ఎం.కె.స్టాలిన్‌ స్పందిస్తూ.. అందమైన తమిళ పేర్లు, వాటి అర్థ వివరణలతో కూడిన వెబ్‌సైట్ను తమిళ్‌ వర్చువల్‌ అకాడమీ ద్వారా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad